ఎండీఆర్‌పై ‘స్టే’ విధించలేం!
ABN , Publish Date - Sep 29 , 2026 | 04:22 AM
రూ.2 వేలు దాటిన యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.
చట్టబద్ధత ఏంటో పరిశీలిస్తాం: సుప్రీం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 28: రూ.2 వేలు దాటిన యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఎండీఆర్‌పై తక్షణం ‘స్టే’ విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. అయితే, ఈ వ్యవహారంపై విచారణ చేస్తామని, ఎండీఆర్ విధింపునకు ఉన్న చట్టబద్ధత ఏంటో పరిశీలిస్తామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిల్‌పై కౌంటర్ అఫిడవిట్ వేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీనిపై 4వారాల్లోగా సమగ్ర వివరాలను అందించాలని కోరుతూ.. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ)లకు నోటీసులు జారీ చేసింది. కాగా, ఎండీఆర్ విధానం అక్టోబరు 15 నుంచి అమల్లోకి రానుంది.
ఈ వార్తలు కూడా చదవండి
రోడ్డు తనిఖీలో చెంపదెబ్బ వివాదం! ఢిల్లీ మంత్రి పర్వేష్ వర్మపై కేసు నమోదు
ఎల్‌పీయూలో భయానక రాత్రి.. ఆ రోజు ఏం జరిగింది..?