Share News

Delhi Air pollution: ఢిల్లీ గాలిలో మందులకు లొంగని బ్యాక్టీరియా

ABN , Publish Date - Jan 06 , 2026 | 01:00 AM

అసలే విపరీతమైన వాయుకాలుష్యంతో కునారిల్లుతున్న దేశ రాజధాని ఢిల్లీ వాతావారణంలో.. శక్తిమంతమైన యాంటీబయాటిక్‌ మందులకు సైతం లొంగని సూపర్‌ బగ్స్‌ వ్యాపిస్తున్నాయని జేఎన్‌యూకు చెందిన స్కూల్‌....

Delhi Air pollution: ఢిల్లీ గాలిలో మందులకు లొంగని బ్యాక్టీరియా

  • అన్నిచోట్లా స్టాఫిలోకోకై బ్యాక్టీరియా

  • జేఎన్‌యూ అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ, జనవరి 5: అసలే విపరీతమైన వాయుకాలుష్యంతో కునారిల్లుతున్న దేశ రాజధాని ఢిల్లీ వాతావారణంలో.. శక్తిమంతమైన యాంటీబయాటిక్‌ మందులకు సైతం లొంగని సూపర్‌ బగ్స్‌ వ్యాపిస్తున్నాయని జేఎన్‌యూకు చెందిన స్కూల్‌ ఆఫ్‌ ఎన్నిరాన్‌మెంటల్‌ సైన్సెస్‌ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. బయటి వాతావరణంలోనే కాదు.. ఇళ్లల్లో ఉండే గాలిలో కూడా మందులకు లొంగని ‘స్టాఫిలోలోకోకై’ అనే బ్యాక్టీరియా ఆనవాళ్లు కనిపించాయని వారు పేర్కొన్నారు. వారు సేకరించిన 100 నమూనాలకుగాను 73 నమూనాల్లో బ్యాక్టీరియా సింగిల్‌ డ్రగ్‌ రెసిస్టెంట్‌ (అంటే ఒకరకం యాంటీబయాటిక్‌ ఔషధానికి లొంగనివి) కాగా.. 36 నమూనాల్లో మల్టీ డ్రగ్‌ రెసిస్టెంట్‌ (అంటే పలు రకాల యాంటీబయాటిక్స్‌కు నిరోధకత సంతరించుకున్న) బ్యాక్టీరియా ఉన్నట్టు ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన మాధురీ సింగ్‌ తెలిపారు. కాగా.. డబ్ల్యూహెచ్‌వో సూచించిన పరిమితి ప్రకారం.. గాలిలో స్టాఫిలోకోకై లోడ్‌ 1000 సీఎ్‌ఫయూ/ఎం3 (ప్రతి ఘనపు మీటరుకూ 16 వేల కాలనీస్‌ ఫర్‌ యూనిట్‌) లోపే ఉండాలి. కానీ ఢిల్లీ గాలిలో.. 16,000 సీఎ్‌ఫయు/ఎం3 ఉండడం ఆందోళన కలిగిస్తోంది. స్టాఫిలో కోకై బ్యాక్టీరియా సాధారణంగా మన చర్మంపైన, ముక్కులోపల ఉండే మ్యూకస్‌ పొరల్లోనూ ఉంటుంది. మనలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే.. మొటిమల వంటి చిన్న సమస్య నుంచి.. న్యూమోనియా, సెప్సిస్‌, సెప్టిసీమియా వంటి తీవ్ర సమస్యల దాకా రకరకాల అనారోగ్యాలకు కారణమవుతుంది. రోగనిరోధక శక్తి అంతగా ఉండని వృద్ధులు, చిన్నపిల్లలు, క్యాన్సర్‌ బాధితులు, అవయవమార్పిడి చేయించుకున్నవారికి ఈ బ్యాక్టీరియా చాలా ప్రమాదకరం.

Updated Date - Jan 06 , 2026 | 01:00 AM