Share News

బీఎల్‌ సంతోష్‌ స్థానంలో సునీల్‌ బన్సల్‌!

ABN , Publish Date - Jun 30 , 2026 | 04:17 AM

కేంద్ర ప్రభుత్వంతో పాటు, బీజేపీ కార్యవర్గంలోనూ మార్పులు చోటుచేసుకుంటాయన్న ఊహాగానాలు వ్యాపించాయి. బీజేపీ పునర్వ్యవస్థీకరణలో...

బీఎల్‌ సంతోష్‌ స్థానంలో సునీల్‌ బన్సల్‌!

  • బీజేపీ సంస్థాగ ప్రధాన కార్యదర్శిగా అవకాశం

  • ఎంపీ, రాజస్థాన్‌ల సీఎంల మార్పూ ఉండొచ్చు

న్యూఢిల్లీ, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వంతో పాటు, బీజేపీ కార్యవర్గంలోనూ మార్పులు చోటుచేసుకుంటాయన్న ఊహాగానాలు వ్యాపించాయి. బీజేపీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రస్తుతం సంస్థాగత వ్య వహారాల ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న బీఎల్‌ సంతోష్‌ను మార్చే అవకాశాలు ఉన్నాయి. ఆయన స్థానంలో ప్రధాన కార్యదర్శిగా ఉన్న సునీల్‌ బన్సల్‌ లేదా ఆర్‌ఎస్‌ఎస్‌ సహ సర్‌కార్యవాహ గా ఉన్న అతుల్‌ లిమాయేను నియమించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో జరిగే భారీ మార్పుల్లో భాగంగా రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులను మార్చే అవకాశాలున్నాయని కూడా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వీటన్నింటికన్నా ముందుగా వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులను భారీగా బదిలీ చేస్తారన్న చర్చ జరుగుతోంది.

Updated Date - Jun 30 , 2026 | 04:17 AM