ఎన్సీపీ జాతీయ అధ్యక్షురాలిగా సునేత్రా పవార్
ABN , Publish Date - Feb 27 , 2026 | 04:03 AM
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సునేత్రా పవార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముంబై వర్లిలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో...
ముంబై, ఫిబ్రవరి 26: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సునేత్రా పవార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముంబై వర్లిలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆమె పేరును పార్టీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ ప్రతిపాదించగా మిగతా సభ్యులంతా మద్దతు తెలిపారు. జనవరి 28న భర్త అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందడంతో సునేత్ర పవార్ గత నెలలోనే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్సీపీకి శరద్ పవార్ తొలి జాతీయ అధ్యక్షుడు కాగా అజిత్ పవార్ రెండో అధ్యక్షుడు. పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళ సునేత్రా పవార్ కావడం గమనార్హం.