డీఎంకే దయాదాక్షిణ్యాలతోనే టీవీకే సర్కారు: స్టాలిన్
ABN , Publish Date - Jun 07 , 2026 | 06:00 AM
తమిళనాట టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటుకు కావలసిన సంఖ్యాబలం లేనప్పుడు డీఎంకే మిత్రపక్షాలు మద్దతునిచ్చి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రాకుండా అడ్డుకున్నట్టు...
చెన్నై, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): తమిళనాట టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటుకు కావలసిన సంఖ్యాబలం లేనప్పుడు డీఎంకే మిత్రపక్షాలు మద్దతునిచ్చి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రాకుండా అడ్డుకున్నట్టు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తెలిపారు. టీవీకే ప్రభుత్వం అధికారంలో ఉందంటే అది కేవలం తమ కూటమి మిత్రపక్షాల దయాదాక్షిణ్యాలవల్లేనన్నారు. అదే సమయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి చరమగీతం పాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో చెంగల్పట్టుకు చెందిన అన్నాడీఎంకే నేత సహా సుమారు 1000 మంది స్టాలిన్ సమక్షంలో డీఎంకే సభ్యత్వం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.