మోదీపై స్టాలిన్, విజయన్ ఆగ్రహం
ABN , Publish Date - Jan 24 , 2026 | 04:22 AM
మోదీ ప్రసంగాలపై తమిళనాడు, కేరళ సీఎంలు స్టాలిన్, విజయన్ మండిపడ్డారు. రాష్ట్రానికి ద్రోహాలు మాత్రమే చేసే బీజేపీ కూటమిని తమిళనాడు...
మోదీ ప్రసంగాలపై తమిళనాడు, కేరళ సీఎంలు స్టాలిన్, విజయన్ మండిపడ్డారు. రాష్ట్రానికి ద్రోహాలు మాత్రమే చేసే బీజేపీ కూటమిని తమిళనాడు ఎప్పుడూ ఓడిస్తుందని స్టాలిన్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ‘ఎన్నికల సీజన్ వచ్చినప్పుడు మాత్రమే తరచూ రాష్ట్రానికి వచ్చే ప్రధాని మోదీ గారూ! తమిళనాడుకు రావలసిన రూ.3,458 కోట్ల సమగ్ర శిక్షా విద్యా నిధి ఎప్పుడు వస్తుంది? డీలిమిటేషన్‌లో తమిళనాడు సీట్లు తగ్గించబోమని హామీ ఎప్పుడిస్తారు? బీజేపీ ఏజెంట్‌గా వ్యవహరించే గవర్నర్ అరాచకం ఎప్పుడు అంతమవుతుంది? మదురై ఎయిమ్స్ నిర్మాణం ఎప్పుడు సాకారమవుతుంది? హోసూరు విమానాశ్రయం, కోయంబత్తూర్, మదురై మెట్రో ప్రాజెక్టులకు ఎప్పుడు ఆమోదం లభిస్తుంది? ‘నీట్’ మినహాయింపు’ ఎప్పుడు అమల్లోకి వస్తుంది’ అని నిలదీశారు. బీజేపీ పాలిత ఒడిశాలో ఇటీవల పాస్టర్‌పై జరిగిన దాడిని విజయన్ ‘ఎక్స్’లో ప్రస్తావించారు. ఇది సంఘ్‌పరివార్ దేశంలో పెంచి పోషిస్తున్న హింసా విద్వేష వాతావరణానికి నిదర్శనమన్నారు. సీపీఎంతో అపవిత్ర పొత్తుతో కేరళను మతప్రాతిపదికన విభజించాలని చూస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఆరోపించారు.