పీఎంవో అడిషనల్ సెక్రటరీగా శ్రీధర్ చిరువోలు
ABN , Publish Date - Apr 01 , 2026 | 03:50 AM
ప్రధానమంత్రి కార్యాలయంలో అడిషనల్ సెక్రటరీగా తెలుగు మూలాలున్న శ్రీధర్ చిరువోలును నియమిస్తూ కేంద్రం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
డీజీసీఏ నూతన సారథిగా వీర్ విక్రమ్ యాదవ్
న్యూఢిల్లీ, మార్చి 31: ప్రధానమంత్రి కార్యాలయంలో అడిషనల్ సెక్రటరీగా తెలుగు మూలాలున్న శ్రీధర్ చిరువోలును నియమిస్తూ కేంద్రం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2001 బిహార్ క్యాడర్‌కు చెందిన ఆయన.. గత ఎనిమిదేళ్లుగా పీఎంవోలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాల రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. జెనెటిక్స్ విభాగంలో ఎంఎస్సీ పూర్తి చేశారు. ఈయనకు తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉంది. ఇక, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) నూతన సారథిగా సీనియర్ ఐఏఎస్ అధికారి వీర్ విక్రమ్ యాదవ్ నియమితులయ్యారు. 1996 ఒడిశా క్యాడర్ చెందిన యాదవ్ ప్రస్తుతం కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలో అడిషనల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు.