Share News

సౌరవ్‌, అశుతో‌ష్‌కు మరో రెండు రోజుల కస్టడీ

ABN , Publish Date - Oct 20 , 2026 | 05:25 AM

కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) నేతలు సౌరవ్‌దాస్‌, అశుతోష్‌ రాంకా జ్యుడీషియల్‌ కస్టడీని మరో రెండు రోజుల పాటు పొడిగిస్తూ, స్పెషల్‌ ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ ఆదేశాలు జారీ చేశారు.

సౌరవ్‌, అశుతో‌ష్‌కు మరో రెండు రోజుల కస్టడీ

  • ఈ నెల 21 వరకు పొడిగిస్తూ ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ ఆదేశాలు

  • వారి తీరు చట్టాన్ని గౌరవిస్తున్నట్టు లేదని వ్యాఖ్య

న్యూఢిల్లీ, అక్టోబరు 19: కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) నేతలు సౌరవ్‌దాస్‌, అశుతోష్‌ రాంకా జ్యుడీషియల్‌ కస్టడీని మరో రెండు రోజుల పాటు పొడిగిస్తూ, స్పెషల్‌ ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలను ఉల్లంఘించి జంతర్‌మంతర్‌ వద్ద నిరసనలకు ప్రయత్నించడంతో సౌరవ్‌, అశుతో్‌షను పోలీసులు ఈ నెల 13న అదుపులోకి తీసుకున్న విషయంం తెలిసిందే. వీరికి విధించిన ఐదు రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ ముగిసిపోవడంతో, సోమవారం ఢిల్లీలోని మందిర్‌మార్గ్‌ పోలీసుస్టేషన్‌ వద్ద కొత్తగా నియమితులైన స్పెషల్‌ ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ (సౌత్‌ వెస్ట్‌ డిస్టిక్ట్‌) ముందు తిరిగి హాజరుపరిచారు. దీంతో మరో రెండురోజుల పాటు (21వరకు) కస్టడీ పొడిగిస్తూ మేజిస్ట్రేట్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మేజిస్ట్రేట్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ రాంకా ప్రవర్తన చట్టాన్ని గౌరవిస్తున్నట్టుగా లేదన్నారు. దర్యాప్తు అధికారి సమర్పించిన ఆధారాలను పరిశీలించిన అనంతరం.. వీరివల్ల శాంతిభద్రతలకు, ప్రజల ప్రశాంతతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. గత చర్యలను పునరావృతం చేయబోమని సౌరవ్‌, అశుతోష్‌ సమర్పించిన హామీలను తిరస్కరించారు. మరోవైపు సీజేపీ నేతల బెయిల్‌ పిటిషన్‌ను విచారిస్తున్న తనను చంపేస్తానంటూ బెదిరింపులు వస్తున్నాయని స్పెషల్‌ ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ చేసిన ఫిర్యాదు మేరకు.. పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై నాన్‌ కాగ్నిజబుల్‌ రిపోర్ట్‌ (ఎన్‌సీఆర్‌) నమోదు చేశారు. మరోవైపు సౌరవ్‌దావ్‌, అశుతోష్‌ రాంకాలను విడుదల చేయకుండా ఉండేందుకు అధికారులు ఉద్దేశపూర్వకంగానే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే ఎక్స్‌లో ఆరోపించారు. ఒకవైపు హత్య కేసులో శిక్ష పడిన వ్యక్తి యూపీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీ చేయాలనుకుంటుంటే, ఆయన దోషిత్వాన్ని, శిక్షను అలహాబాద్‌ హైకోర్టు నిలిపివేయగా.. మరోవైపు దాస్‌, రాంకా జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగించారని దీప్కే విమర్శించారు.

Updated Date - Oct 20 , 2026 | 05:27 AM