Share News

ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ

ABN , Publish Date - Oct 23 , 2026 | 03:38 AM

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టారు. గురువారం తన ఖాతా ప్రారంభించారు. త్వరలో విడుదల కాబోయే తన ఆత్మకథ ‘‘బిలాంగింగ్‌- ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’ పుస్తకాన్ని..

ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ

న్యూఢిల్లీ, అక్టోబరు 22: కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టారు. గురువారం తన ఖాతా ప్రారంభించారు. త్వరలో విడుదల కాబోయే తన ఆత్మకథ ‘‘బిలాంగింగ్‌- ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’ పుస్తకాన్ని పరిచయం చేస్తూ ఆ ఖాతాలో తొలి వీడియోను షేర్‌ చేశారు. ‘ఇది ప్రేమ, కర్తవ్యం, నష్టం, స్థానాన్ని అన్వేషించడం వంటి వాటికి సంబంధించిన కథ. దీనిని మీతో పంచుకోవడానికి ఎదురుచూస్తున్నాను’ అని ఈ సందర్భంగా చెప్పారు. పుస్తకం ఫస్ట్‌లుక్‌ను ఇలా షేర్‌ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా కుమార్తె ప్రియాంక గాంధీతో స్వీట్లు పంచుకున్నారు. ఈ పుస్తకం నవంబరు 10న విడుదల కాబోతోందని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ చెప్పారు.

Updated Date - Oct 23 , 2026 | 03:41 AM