Share News

సోనియా గాంధీకి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

ABN , Publish Date - Mar 25 , 2026 | 03:33 AM

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమెను కుటుంబసభ్యులు న్యూఢిల్లీలోని గంగారామ్‌ ఆస్పత్రిలో...

సోనియా గాంధీకి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

న్యూఢిల్లీ, మార్చి 24: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమెను కుటుంబసభ్యులు న్యూఢిల్లీలోని గంగారామ్‌ ఆస్పత్రిలో మంగళవారం చేర్పించినట్టు తెలిసింది. డాక్టర్‌ అనూప్‌ బసు నేతృత్వంలోని వైద్యుల బృందం సోనియా గాంధీకి చికిత్స అందిస్తున్నారు. సోనియా గాంధీ కుమారుడు రాహుల్‌ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ ప్రస్తుతం తల్లి వెంటే ఆస్పత్రిలో ఉన్నారు. సోనియా ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్య బృందం చెబుతోంది. కాగా, జనవరి నెలలోనూ అస్వస్థతకు గురైన సోనియా గాంధీ అప్పుడు కూడా గంగారామ్‌ ఆస్పత్రిలోనే చికిత్స పొందారు. సోనియా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నారని ఆ ఆస్పత్రి చైర్మన్‌ డాక్టర్‌ అజయ్‌ స్వరూప్‌ అప్పట్లో ప్రకటించారు. కాలుష్యం వల్ల ఆమె అస్వస్థతకు గురై ఉంటారని పేర్కొన్నారు.

Updated Date - Mar 25 , 2026 | 03:33 AM