Share News

Sonia Gandhi Hospitalized: సోనియాగాంధీకి అస్వస్థత

ABN , Publish Date - Jan 07 , 2026 | 02:31 AM

కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో సోమవారం రాత్రి ఢిల్లీలోని గంగారామ్‌ ఆస్పత్రిలో చేరారు..

Sonia Gandhi Hospitalized: సోనియాగాంధీకి అస్వస్థత

  • ఢిల్లీ కాలుష్య ప్రభావమే కారణమన్న వైద్యులు!

న్యూఢిల్లీ, జనవరి 6: కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో సోమవారం రాత్రి ఢిల్లీలోని గంగారామ్‌ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 79ఏళ్ల సోనియాకు దీర్ఘకాలిక దగ్గు సమస్య ఉండడంతో పాటు ఢిల్లీలో ఉన్న వాయు కాలుష్య పరిస్థితుల నేపథ్యంలో తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇప్పుడు చలి తీవ్రత కూడా తోడవడంతో శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఒక్కసారిగా తిరగబెట్టాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఛాతీ వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆందోళన అవసరంలేదని ఆస్పత్రి చైర్మన్‌ చెప్పారు.

Updated Date - Jan 07 , 2026 | 02:31 AM