Share News

Sir Ganga Ram Hospital: కోలుకున్న సోనియా గాంధీ

ABN , Publish Date - Jan 12 , 2026 | 05:13 AM

అనారోగ్యం నుంచి కాంగ్రెస్‌ నాయకురాలు సోనియా గాంధీ (79) కోలుకున్నారు. దాంతో ఆదివారం సాయంత్రం ఆమె సర్‌ గంగారాం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.

Sir Ganga Ram Hospital: కోలుకున్న సోనియా గాంధీ

  • ఆస్పత్రి నుంచి డిశ్చార్జి

న్యూఢిల్లీ, జనవరి 11: అనారోగ్యం నుంచి కాంగ్రెస్‌ నాయకురాలు సోనియా గాంధీ (79) కోలుకున్నారు. దాంతో ఆదివారం సాయంత్రం ఆమె సర్‌ గంగారాం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆస్త్మా, చెస్ట్‌ ఇన్‌ఫెక్షన్‌ ఇతర సమస్యల కారణంగా ఈ నెల అయిదో తేదీన ఆమె ఆ ఆస్పత్రిలో చేరారు. వారం రోజుల పాటు చెస్ట్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ అరుప్‌ బసు ఆమెకు చికిత్సలు అందించారు. కోలుకోవడంతో ఆమెను డిశ్చార్జి చేశామని, ఇంటి వద్దే వైద్యం చేయించుకోవాలని సూచించామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Updated Date - Jan 12 , 2026 | 06:02 AM