Share News

సోనియా జీవిత కథ ప్రచురణకు హార్పర్‌ కాలిన్స్‌ రెడీ

ABN , Publish Date - Sep 05 , 2026 | 05:07 AM

కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ జీవిత చరిత్రను నవంబరు 10వ తేదీన ప్రచురించనున్నట్లు ప్రముఖ ప్రచురణ సంస్థ ‘హార్పర్‌కాలిన్స్‌ ఇండియా’ వెల్లడించింది.

సోనియా జీవిత కథ ప్రచురణకు హార్పర్‌ కాలిన్స్‌ రెడీ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 4: కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ జీవిత చరిత్రను నవంబరు 10వ తేదీన ప్రచురించనున్నట్లు ప్రముఖ ప్రచురణ సంస్థ ‘హార్పర్‌కాలిన్స్‌ ఇండియా’ వెల్లడించింది. ‘బిలాంగింగ్‌: ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’ అనే పేరుగల ఈ పుస్తకం ప్రచురణ విషయంలో ‘పెంగ్విన్‌ ర్యాండమ్‌ హౌస్‌ ఇండియా’ సంస్థ-సోనియా ప్రతినిధుల మధ్య వివాదం నెలకొనడం.. భారత్‌లో ఈ పుస్తకాన్ని తాము ప్రచురించడం లేదని పెంగ్విన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హార్పర్‌ కాలిన్స్‌ ఇండియా ఆ బాధ్యత తీసుకుంది. నవంబరు 10న పుస్తకాన్ని విడుదల చేయనుంది.

Updated Date - Sep 05 , 2026 | 05:10 AM