60రోజుల గృహనిర్బంధంలో సోనమ్ వాంగ్‌చుక్!
ABN , Publish Date - Nov 16 , 2026 | 03:14 AM
సోనమ్ వాంగ్‌చుక్‌ను 60రోజుల పాటు గృహనిర్బంధంలో ఉంచారు. రాబోయే లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్(ఎల్‌ఏహెచ్ డీసీ) ఎన్నికలకు వ్యతిరేకంగా జరుగుతున్న..
శ్రీనగర్, నవంబరు 15: సోనమ్ వాంగ్‌చుక్‌ను 60రోజుల పాటు గృహనిర్బంధంలో ఉంచారు. రాబోయే లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్(ఎల్‌ఏహెచ్ డీసీ) ఎన్నికలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల నేపథ్యంలో లేహ్ యంత్రాంగం ఈ ఆంక్షలు విధించింది. ఆయన బహిరంగ సభలు, ర్యాలీలు లేదా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీలు లేదు. డిసెంబర్ 4న హిల్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వాంగ్‌చుక్, స్థానిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. చలికాలంలో వేలాదిమంది స్థానికులు వలస వెళ్తారని, దీనివల్ల ఓటర్లు తమ ఓటుహక్కును కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. 2019లో కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడిన తర్వాత లడఖ్‌లో జరుగుతున్న తొలి ప్రధాన ఎన్నికలివి.