సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ దీక్ష
ABN , Publish Date - Jun 29 , 2026 | 04:35 AM
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద పర్యావరణ వేత్త సోనమ్...
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్
న్యూఢిల్లీ, జూన్ 26: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ దీక్షకు దిగారు. నీట్ అవకతవకలకు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలంటూ జూన్ 20 నుంచి కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనకు వాంగ్‌చుక్ మద్దతు ప్రకటించారు. అయితే, ఆయన దీక్షకు దిగిన కొద్ది గంటల్లోనే ఢిల్లీ పోలీసులు జంతర్‌మంతర్ వద్ద శానిటేషన్ సౌకర్యాలు నిలిపివేశారని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆరోపించారు. నిరసన స్థలంలో తాగునీటి కనెక్షన్ కూడా లేదని, కనీస పారిశుధ్య సౌకర్యాలు కల్పించకుండా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. వాంగ్‌చుక్ వయసు, ఆరోగ్య సమస్యల గురించి చెప్పినా పట్టించుకోవడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.