నీ సమాధిపై డాన్స్ చేస్తాం
ABN , Publish Date - Mar 03 , 2026 | 04:16 AM
ఇరాన్‌లో ఖమేనీకి వ్యతిరేకంగా గతంలో జరిగిన ఆందోళనల్లో సిగరెట్ కాల్చి వైరల్ అయిన ఓ యువతి, ఇప్పుడు ఆయన మృతితో మారోసారి వార్తల్లో నిలిచింది.
ఖమేనీ మృతికి ‘స్మోకింగ్ గర్ల్’ సంబరం
న్యూఢిల్లీ, మార్చి 2: ఇరాన్‌లో ఖమేనీకి వ్యతిరేకంగా గతంలో జరిగిన ఆందోళనల్లో సిగరెట్ కాల్చి వైరల్ అయిన ఓ యువతి, ఇప్పుడు ఆయన మృతితో మారోసారి వార్తల్లో నిలిచింది. 1930వ దశకంలో ప్రఖ్యాత కల్పిత పాత్ర మోర్టీసియా ఆడమ్స్ పేరు పెట్టుకుని ఎక్స్‌లో ఆ యువతి ఇరాన్‌కు వ్యతిరేకంగా కెనడాలో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న తన పాత వీడియోను పోస్టు చేసింది. దానితో పాటు ‘‘నేను చెప్పాను కదా.. నీ సమాధిపై డాన్స్ చేస్తాం అని’’ అంటూ ఆ వీడియోకు వ్యాఖ్యను జోడించింది. మరో పోస్టులో ‘‘మూషాలీ (ఖమేనీకి ఆందోళనకారులు పెట్టిన పేరు) దయనీయ మృతి సంతోషకరం. డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లు ఆయన మూషికంలా చనిపోయాడు’’ అని పేర్కొంది. జనవరి నెలలో ఆమె ఖమేమీ ఫొటోకు నిప్పుపెట్టి ఆ మంటతో సిగరెట్ కాల్చడం వైరల్ అయింది. ప్రస్తుతం ఆ యువతి మారుపేరుతో విద్యార్థి వీసాపై కెనడాలోని టొరంటోలో నివసిస్తోంది. ఇరాన్‌లో అరెస్టు, దాడుల నుంచి ఎలా తప్పించుకుని ఇక్కడకు చేరిందో గతంలో ప్రస్తావించింది.