Share News

ప్రైవేట్‌, ఎయిడెడ్‌ స్కూళ్లకు ‘ఎస్‌ఎమ్‌సీ’ నిబంధనలు వర్తించవు: కేంద్రం

ABN , Publish Date - May 22 , 2026 | 03:37 AM

దేశంలోని ప్రైవేట్‌, ఎయిడెడ్‌ పాఠశాలలకు ‘పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్‌ఎమ్‌సీ) మార్గదర్శకాలు- 2026’ నిబంధనలు వర్తించవని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది.

ప్రైవేట్‌, ఎయిడెడ్‌ స్కూళ్లకు ‘ఎస్‌ఎమ్‌సీ’ నిబంధనలు వర్తించవు: కేంద్రం

న్యూఢిల్లీ, మే 21 (ఆంధ్రజ్యోతి): దేశంలోని ప్రైవేట్‌, ఎయిడెడ్‌ పాఠశాలలకు ‘పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్‌ఎమ్‌సీ) మార్గదర్శకాలు- 2026’ నిబంధనలు వర్తించవని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వాలు, స్థానిక సంస్థల నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం, గ్రాంట్లు పొందని విద్యాసంస్థలను ఈ నూతన మార్గదర్శకాల పరిధి నుంచి మినహాయిస్తున్నట్లు వెల్లడించింది. విద్యాహక్కు చట్టం- 2009లోని సెక్షన్‌ 21 పరిధిలోకి వచ్చే విభిన్న యాజమాన్యాల పాఠశాలలకు ఈ నిబంధనల వర్తింపుపై పలు వర్గాల నుంచి వ్యక్తమైన ఆందోళనల నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అధికారిక సమాచారం పంపినట్లు కేంద్ర విద్యాశాఖ పేర్కొంది.

Updated Date - May 22 , 2026 | 03:37 AM