మశూచి నివారణకు కృషి చేసిన..డాక్టర్ విలియం ఫేగీమృతి
ABN , Publish Date - Jan 27 , 2026 | 03:02 AM
ప్రపంచ వ్యాప్తంగా మశూచి వ్యాధిని నిర్మూలించేందుకు ఎంతో కృషి చేసిన డాక్టర్ విలియం ఫేగీ(89) అమెరికాలోని అట్లాంటాలో శనివారం మృతి చెందారు
అట్లాంటా, జనవరి 26: ప్రపంచ వ్యాప్తంగా మశూచి వ్యాధిని నిర్మూలించేందుకు ఎంతో కృషి చేసిన డాక్టర్ విలియం ఫేగీ(89) అమెరికాలోని అట్లాంటాలో శనివారం మృతి చెందారు. ఆయన అమెరికా వ్యాధి నివారణ, నియంత్రణ కేంద్రాల డైరెక్టర్‌గా 1970-1980లో పనిచేశారు. ప్రపంచ వ్యాప్తంగా పలు వ్యాధుల నివారణ కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది మరణాలకు కారణమైన మశూచి వ్యాధి నివారణకు ఆయన తీవ్రంగా కృషి చేశారు. ఫేగీ, ఆయన సహచరులు నైజీరియా దేశంలో మశూచి నివారణకు అనుసరించిన విధానం చక్కని ఫలితాలనిచ్చింది. భారత్‌లోనూ ఆయన మశూచి నివారణకు పనిచేశారు.