Share News

Education policy: తెలుగు రాష్ట్రాల్లో అమలుకాని1వ తరగతి అడ్మిషన్‌కు ‘ఆరేళ్ల’ రూల్‌!

ABN , Publish Date - Jan 03 , 2026 | 02:35 AM

జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)-2020 నిబంధనల ప్రకారం ఒకటో తరగతిలో ప్రవేశానికి పిల్లలకు కనీసంగా ఆరేళ్లు నిండి ఉండాలన్న ప్రమాణాన్ని దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలు, ...

Education policy: తెలుగు రాష్ట్రాల్లో అమలుకాని1వ తరగతి అడ్మిషన్‌కు ‘ఆరేళ్ల’ రూల్‌!

న్యూఢిల్లీ, జనవరి 2: జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)-2020 నిబంధనల ప్రకారం ఒకటో తరగతిలో ప్రవేశానికి పిల్లలకు కనీసంగా ఆరేళ్లు నిండి ఉండాలన్న ప్రమాణాన్ని దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఇంకా అమలు చేయలేదు. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, ఛత్తీసగఢ్‌లు ఉన్నాయి. ఎన్‌ఈపీ-2020, ఆర్టీఈ-2009 చట్టంలోని నిబంధనల ప్రకారం.. ఇంతకుముందు అనుసరిస్తున్న ‘5 ప్లస్‌’ ఏళ్ల విధానానికి బదులుగా ఆరేళ్ల వయసు నిండిన తర్వాతనే పిల్లలను 1వ తరగతిలో చేర్చుకోవాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ 2023లో రాష్ట్రాలు, యూటీలకు ఆదేశాలు జారీచేసింది. కొన్ని రాష్ట్రాలు ఇంకా 1వ తరగతి ప్రవేశాల కోసం విభిన్న వయో ప్రమాణాలను అనుసరిస్తున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

Updated Date - Jan 03 , 2026 | 02:35 AM