Share News

‘సర్‌’ మళ్లీ పొడిగింపు

ABN , Publish Date - Oct 30 , 2026 | 02:19 AM

క్లెయిములు, అభ్యంతరాల నమోదుకు గడువును పొడిగించాల్సిందిగా బుధవారం సుప్రీం కోర్టు నిర్దేశించిన సంగతి తెలిసిందే.

‘సర్‌’ మళ్లీ పొడిగింపు

  • తెలంగాణ, ఏపీల్లో నవంబరు 26 వరకూ

  • తుది జాబితా ప్రచురణ నవంబరు 30న

  • ఢిల్లీలో నవంబరు 25 వరకూ గడువు

  • తుది ఓటర్ల జాబితా డిసెంబరు 22న

  • సుప్రీం నిర్దేశించిన ఒక్క రోజులోనే ప్రకటన

  • మహారాష్ట్ర, హరియాణా, నాగాలాండ్‌ల్లో కూడా గడువు పెంపు

ఇంటర్నెట్ డెస్క్: క్లెయిములు, అభ్యంతరాల నమోదుకు గడువును పొడిగించాల్సిందిగా బుధవారం సుప్రీం కోర్టు నిర్దేశించిన సంగతి తెలిసిందే. అక్కడ ఇప్పట్లో ఎన్నికలు లేనప్పుడు అంత హడావుడి ఎందుకని కూడా ప్రశ్నించింది. గడువు పొడిగించాలంటూ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిన ఒక్క రోజులోనే ఈసీ నుంచి నిర్ణయం వెలువడడం గమనార్హం. ఇక, తెలంగాణ, ఏపీలలో ఫిర్యాదులు, అభ్యంతరాల గడువును నవంబరు 26 వరకూ పొడిగించింది. ఓటర్ల తుది జాబితాను నవంబరు 30న ప్రచురిస్తారు. మహారాష్ట్రలో క్లెయిములు, అభ్యంతరాల నమోదుకు గడువును అక్టోబరు 26వ తేదీ నుంచి నవంబరు 13వ తేదీకి పొడిగించింది. నోటీసులు, క్లెయిముల పరిష్కారం నవంబరు 25 వరకూ కొనసాగుతుంది. తుది ఓటరు జాబితాను నవంబరు 30న ప్రచురిస్తారు. ఆయా రాష్ట్రాల్లో వివిధ కారణాలతో సర్‌ గడువును ఇప్పటికే పొడిగించిన సంగతి తెలిసిందే.

Updated Date - Oct 30 , 2026 | 02:21 AM