Share News

సిమ్‌ దుర్వినియోగానికి మూడేళ్ల జైలు

ABN , Publish Date - Sep 22 , 2026 | 04:20 AM

నకిలీ, ఇతరుల గుర్తింపు పత్రాలతో సిమ్‌ కార్డులు తీసుకోవడం, మొబైల్‌ ఫోన్ల ఐఎంఈఐ నంబర్లను ట్యాంపరింగ్‌ చేయడం చట్టరీత్యా నేరమని టెలికాం విభాగం (డాట్‌) స్పష్టం చేసింది.

సిమ్‌ దుర్వినియోగానికి మూడేళ్ల జైలు
sim

రూ.50 లక్షల జరిమానా కూడా..

న్యూఢిల్లీ, సెప్టెంబరు 21: నకిలీ, ఇతరుల గుర్తింపు పత్రాలతో సిమ్‌ కార్డులు తీసుకోవడం, మొబైల్‌ ఫోన్ల ఐఎంఈఐ నంబర్లను ట్యాంపరింగ్‌ చేయడం చట్టరీత్యా నేరమని టెలికాం విభాగం (డాట్‌) స్పష్టం చేసింది. ఇటువంటి ఉల్లంఘనలకు పాల్పడితే టెలికమ్యూనికేషన్‌ చట్ట నిబంధనల మేరకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా విధించే అవకాశముందని పేర్కొంది. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో ఓ పాయింట్‌ ఆఫ్‌ సెల్‌ (పీవోఎస్‌) ఏజెంట్‌.. ఇతరుల ధ్రువపత్రాలను వారి అనుమతి లేకుండా తీసుకొని 25 సిమ్‌ కార్డులను యాక్టివేట్‌ చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. దీంతో ఆ ఏజెంట్‌ను టెలికాం సంస్థలతో కలిసి డాట్‌ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. అక్రమంగా యాక్టివేట్‌ చేసిన సిమ్‌లను కూడా డీయాక్టివేట్‌ చేసింది. ఈ నేపథ్యంలోనే సిమ్‌ కార్డుల వినియోగంపై పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది. సంచార్‌ సాథీ పోర్టల్‌ లేదా యాప్‌ ద్వారా తమ పేరుపై ఉన్న మొబైల్‌ నంబర్లను తనిఖీ చేసుకోవాలని సూచించింది.

Updated Date - Sep 22 , 2026 | 04:25 AM