Share News

గొర్రెల కాపరి సీఎం అయ్యాడని పట్టభద్రుల కళ్లు ఎర్రబడ్డాయి!

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:11 AM

గొర్రెల కాపరి ముఖ్యమంత్రి అయ్యాడని పట్టభద్రుల కళ్లు ఎర్రబడ్డాయి’ అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరాయ్య తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ...

గొర్రెల కాపరి సీఎం అయ్యాడని పట్టభద్రుల కళ్లు ఎర్రబడ్డాయి!

  • ఫేస్‌బుక్‌లో సిద్దరామయ్య 9పోస్టులు

బెంగళూరు, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): ‘ గొర్రెల కాపరి ముఖ్యమంత్రి అయ్యాడని పట్టభద్రుల కళ్లు ఎర్రబడ్డాయి’ అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరాయ్య తన ఫేస్‌బుక్‌ ఖాతాలో శుక్రవారం పోస్టులు పెట్టారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై చర్చలు సాగుతున్న తరుణంలో ఆయన పెట్టిన పోస్టు కలకలం రేపుతోంది. తనపై.. తన వ్యతిరేకుల దాడులు, ఆరోపణలకు తాను పుట్టిన కులం ఒక కారణమని ఆయన పేర్కొన్నారు. ‘గొర్రెలు కాసేవారు ముఖ్యమంత్రి అయిపోయారు. ఆర్థిక నిపుణులతో సమానంగా నిలబడి వరుసగా బడ్జెట్‌లు ప్రవేశపెట్టి ప్రశంసలు పొందుతున్నారనే అసహనం. ద్వేషం, అసూయతో వారి కళ్లు మండుతున్నాయి..’ అని ఆయన రాసుకున్నారు. ఇతడొక్కడిని రాజకీయంగా అంతం చేస్తే ఆ తర్వాత తమకు మార్గం సుగమం అవుతుందనే దురుద్దేశం వారి మనసులో ఉందని పేర్కొన్నారు. ఎవరి పేరు ప్రస్తావించకుండా సిద్దరామయ్య ఇలా ఒకేరోజు ఏకంగా 9పోస్ట్‌లు పెట్టి సంచలనం రేపారు. సామాజిక న్యాయం కోసం తుదిశ్వాస వరకు పోరాడతానన్నారు.

Updated Date - Feb 21 , 2026 | 12:11 AM