Share News

సిద్దూ రాజీనామాను ఆమోదించిన గవర్నర్‌

ABN , Publish Date - May 30 , 2026 | 03:15 AM

కర్ణాటక సీఎం సిద్దరామయ్య రాజీనామాను గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ ఆమోదించారు. ఆర్టికల్‌ 164(1) ప్రకారం సిద్దరామయ్య రాజీనామాను..

సిద్దూ రాజీనామాను ఆమోదించిన గవర్నర్‌

బెంగళూరు, మే 29 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక సీఎం సిద్దరామయ్య రాజీనామాను గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ ఆమోదించారు. ఆర్టికల్‌ 164(1) ప్రకారం సిద్దరామయ్య రాజీనామాను ఆమోదించినట్టు లోక్‌భవన్‌ శుక్రవారం ప్రకటించింది. ఆయన మంత్రివర్గం కూడా వెంటనే రద్దు అవుతుందని ఉత్తర్వులలో పేర్కొంది. తదుపరి ముఖ్యమంత్రి ఎన్నికయ్యేదాకా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య కొనసాగుతారని తెలిపింది. కాగా, విధానసౌధ మూడో అంతస్తులోని బ్యాంక్వెట్‌ హాల్‌లో శనివారం సాయం త్రం 4 గంటలకు సీఎల్పీ సమావేశం జరుగుతుందని కేపీసీసీ కార్యదర్శి అల్లమప్రభు పాటిల్‌ శుక్రవారం తెలిపారు. కాగా, ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం సిద్దరామయ్య... కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో శుక్రవారం భేటీ అయ్యారు. ‘ఎనిమిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు’ అని రాహుల్‌ గాంధీకి సిద్దరామయ్య కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - May 30 , 2026 | 03:15 AM