Share News

సిద్దరామయ్యపై స్టింగ్‌ ఆపరేషన్‌ కట్టుకథే!

ABN , Publish Date - Oct 30 , 2026 | 02:34 AM

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై స్టింగ్‌ ఆపరేషన్‌ జరినట్టు సోషల్‌ మీడియాలో వచ్చిన వీడియో నకిలీదని సీసీబీ పోలీసులు ప్రకటించారు.

సిద్దరామయ్యపై స్టింగ్‌ ఆపరేషన్‌ కట్టుకథే!

  • ఆ వీడియో నకిలీదని తేల్చిన సీసీబీ పోలీసులు

బెంగళూరు, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై స్టింగ్‌ ఆపరేషన్‌ జరినట్టు సోషల్‌ మీడియాలో వచ్చిన వీడియో నకిలీదని సీసీబీ పోలీసులు ప్రకటించారు. ఈ కేసు దర్యాప్తు అనంతరం గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. సిద్దరామయ్య ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు, బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు ఓ యువతిని ఆయన లైంగికంగా వేధించినట్టు నకిలీ వీడియో సృష్టించారని పేర్కొన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని సిద్దరామయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీబీ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై పత్రికలు, ఎలకా్ట్రనిక్‌ మీడియాలో కథనాలు రాకుండా ఆయన కోర్టు ఉత్తర్వులు తెచ్చారు. సిద్దరామయ్య స్వయంగా కోర్టును ఆశ్రయించడంతో సర్వత్రా చర్చ జరిగింది. సోషల్‌ మీడియాలో పెట్టిన వీడియోల గురించి సీసీబీ పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసినట్టు ప్రకటించారు. వీడియోలో కనిపించిన, మాట్లాడినవారందరినీ విచారించామని, ప్రతి ఒక్కరినీ రెండుమూడుసార్లు విచారించిన అనంతరం ఆరోపణలలో వాస్తవం లేదని తేలిందని పేర్కొన్నారు.

Updated Date - Oct 30 , 2026 | 02:35 AM