అయోధ్యలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
ABN , Publish Date - Mar 28 , 2026 | 04:48 AM
అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. బాలరాముడి దర్శనానికి లక్షల మంది భక్తులు పోటెత్తారు.
అయోధ్య, మార్చి 27: అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. బాలరాముడి దర్శనానికి లక్షల మంది భక్తులు పోటెత్తారు. అభిజిత్ ముహూర్త సమయంలో రాముడి నుదుటిపైన సూర్యతిలకం చూసి పరవశించిపోయారు. ప్రత్యేకమైన కటకాల సాయంతో రాముడి విగ్రహం నుదుటిపై సూర్యకాంతి 9నిమిషాలు పడేలా అర్చకులు, అధికారులు ఏర్పాట్లు చేశారు. శ్రీరామనవమి సందర్భంగా 14మంది అర్చకులు రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.