Share News

అధిక వడ్డీల ఆశ చూపి..3 వేల కోట్లు కొల్లగొట్టి

ABN , Publish Date - May 17 , 2026 | 05:06 AM

అధిక వడ్డీ ఆశ చూపి బెళగావితోపాటు వివిధ ప్రాంతాల ప్రజలను నమ్మించి వేల కోట్ల రూపాయలు వసూలు చేసిన శివం అసోసియేట్స్‌ యజమాని శివానంద నీలణ్ణవర్‌ను...

అధిక వడ్డీల ఆశ చూపి..3 వేల కోట్లు కొల్లగొట్టి

  • బెళగావిలో శివం అసోసియేట్స్‌ యజమాని అరెస్టు

బెంగళూరు, మే 16(ఆంధ్రజ్యోతి): అధిక వడ్డీ ఆశ చూపి బెళగావితోపాటు వివిధ ప్రాంతాల ప్రజలను నమ్మించి వేల కోట్ల రూపాయలు వసూలు చేసిన శివం అసోసియేట్స్‌ యజమాని శివానంద నీలణ్ణవర్‌ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా శివానంద 3500 మందికి అధిక వడ్డీల ఆశ చూపి రూ.3 వేల కోట్లు సేకరించారు. పోలీసులు శివానంద కార్యాలయంలో పోలీసులు వందల సంఖ్యలో ఉన్న బాండు పేపర్లు, చెక్కులు చూసి విస్తుపోయారు. ఒకేవారంలో రూ.50 కోట్ల దాకా పెట్టుబడులు వచ్చినట్లు గుర్తించారు. బాండు పేపర్లతోపాటు 3,700 చెక్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నీలణ్ణవర్‌ అరెస్టుతో తమ సొమ్ము వస్తుందో లేదోనని డిపాజిటర్లు ఆందోళన చెందుతున్నారు. అయితే,నీలణ్ణవర్‌ ఓ ఆడియోను విడుదల చేశారు. డిపాజిటర్లు ఎవరూ ఆందోళన చెందవద్దని అభయం ఇచ్చారు.

Updated Date - May 17 , 2026 | 05:06 AM