కొత్త పాస్‌పోర్ట్ కోసం హసీనా దరఖాస్తు
ABN , Publish Date - Nov 10 , 2026 | 02:52 AM
భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి తన దేశం వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందులోభాగంగా కొత్త పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు..
న్యూఢిల్లీ, నవంబరు 9: భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి తన దేశం వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందులోభాగంగా కొత్త పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు పత్రం(ఎన్‌ఐడీ) కోసం దరఖాస్తు చేశారు. ఢాకా ఆందోళనల నేపథ్యంలో 2024 ఆగస్టులో హసీనా బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌కు రావడంతోనే, ఆమె జాతీయ గుర్తింపు, పాస్‌పోర్టులను తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేసింది. అయితే, హసీనాకు పాస్‌పోర్టు లేక ట్రావెల్ డాక్యుమెంట్లను జారీచేసే ప్రసక్తే లేదని, ఆ దేశ విదేశాంగ వ్యవహారాల సహాయ మంత్రి కబీర్ స్పష్టం చేశారు. ‘‘హసీనాను భారత్ మాకు అప్పగించాల్సిందే. నేరస్ధుల అప్పగింత ఒప్పందంలోని నిబంధనలను భారత్ పాటించాలి. పాస్‌పోర్టు తీసుకుని రావడం కాదు, న్యాయ విచారణను ఎదుర్కొనేందుకు మాత్రమే ఆమె బంగ్లాదేశ్‌కు రావాలి’’ అని కబీర్ స్పష్టం చేశారు.