Share News

24న శశికళ కొత్త పార్టీ

ABN , Publish Date - Feb 16 , 2026 | 03:59 AM

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు వీకే శశికళ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు.

24న శశికళ కొత్త పార్టీ

చెన్నై, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు వీకే శశికళ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆమె తన నివాసంలో తన అనుయాయులతో వరుసగా భేటీ అవుతున్నారు. తన సన్నిహితురాలు జయలలిత జయంతి రోజైన ఫిబ్రవరి 24న పార్టీ స్థాపించాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజున పార్టీ పేరు, చిహ్నం, విధివిధానాలను కూడా వెల్లడించనున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడైన ముత్తురామలింగదేవర్‌ స్వస్థలమైన రామనాధపురం జిల్లా పశుంపొన్‌లో ఆమె పార్టీని ప్రారంభించనున్నారు.

Updated Date - Feb 16 , 2026 | 03:59 AM