Share News

శశికళ కొత్త పార్టీ ప్రారంభం

ABN , Publish Date - Mar 14 , 2026 | 04:35 AM

తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరో పార్టీ ఆవిష్కృతమైంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు, అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు...

శశికళ కొత్త పార్టీ ప్రారంభం

  • పార్టీ పేరు ఏపీఎంఎంకే... గుర్తు కొబ్బరి చెట్లు

చెన్నై, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరో పార్టీ ఆవిష్కృతమైంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు, అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు వీకే శశికళ కొత్తగా స్థాపించిన పార్టీ పేరును ‘ఆలిండియా పురచ్చి తలైవర్‌ మక్కల్‌ మున్నేట్ర కళగం’ (ఏపీఎంఎంకే)గా ప్రకటించారు. నాలుగు కొబ్బరి చెట్లతో కూడిన పార్టీ చిహ్నాన్ని కూడా ప్రదర్శించారు. స్థానిక పోయె్‌సగార్డెన్‌లోని తన నివాసంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. పార్టీ గుర్తుకు ఎన్నికల సంఘం అనుమతి కూడా ఇచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా శశికళ మాట్లాడుతూ.. తమ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు, పుదుచ్చేరిల్లో పోటీ చేస్తుందని, అన్నాడీఎంకేలోని అసమ్మతివాదులతో కలిసి ముందుకు సాగుతామని పేర్కొన్నారు. డీఎంకేని అధికారం నుంచి దించివేయడమే తన లక్ష్యమని తెలిపారు. ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధిలేని డీఎంకే, అన్నాడీఎంకేల గురించి ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతామని వివరించారు.

Updated Date - Mar 14 , 2026 | 04:35 AM