Share News

ఇండియా.. బంగ్లానో, ఫ్రాన్సో కాదు!

ABN , Publish Date - Oct 20 , 2026 | 05:52 AM

బంగ్లాదేశ్‌, ఫ్రాన్స్‌ తరహాలో భారత్‌లో కూడా అలజడులు రేపి.. మోదీ ప్రభుత్వాన్ని మార్చేందుకు కుట్ర పన్నారంటూ కేంద్రమంత్రి కిరెన్‌ రిజిజు చేసిన ఆరోపణను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశి థరూర్‌ తోసిపుచ్చారు.

ఇండియా.. బంగ్లానో, ఫ్రాన్సో కాదు!

  • ‘ప్రభుత్వ మార్పు’ ఆరోపణను తోసిపుచ్చిన థరూర్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 19: బంగ్లాదేశ్‌, ఫ్రాన్స్‌ తరహాలో భారత్‌లో కూడా అలజడులు రేపి.. మోదీ ప్రభుత్వాన్ని మార్చేందుకు కుట్ర పన్నారంటూ కేంద్రమంత్రి కిరెన్‌ రిజిజు చేసిన ఆరోపణను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశి థరూర్‌ తోసిపుచ్చారు. మన దేశం ఆ రెండు దేశాలవంటిది కాదని.. బస్సులను, పోలీసు స్టేషన్లను తగులబెట్టడం వంటి హింసాకాడను ప్రతిపక్షాలు ఒక్కనాటికీ సమర్థించవని స్పష్టంచేశారు. భారత వ్యతిరేక ముఠాలతో కలిసి కొందరు రాజకీయ నేతలు యువతను రెచ్చగొట్టి వీధుల్లో హింసాకాండను విస్తరింపజేయాలని కుట్ర పన్నారని రిజిజు ‘ఎక్స్‌’లో ఆరోపించారు. దీనిపై థరూర్‌ స్పందించారు. ఆ రెండు దేశాలతో భారత్‌కు పోలిక లేదని.. ఎన్నికలు నిష్పాక్షికంగా జరపాలని మాత్రమే తాము కోరుతున్నామని తెలిపారు. ప్రభుత్వ మార్పిడి అనే పదబంధాన్ని వేరుగా వక్రీకరించవద్దని సూచించారు. ‘సర్‌ చట్టవిరుద్ధమైన ప్రక్రియ.. భారీ సంఖ్యలో ఓటర్లను తొలగించారు.. దీనిని సరిదిద్దాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయే తప్ప ప్రభుత్వ మార్పిడి కోసం చేస్తున్న ప్రయత్నం కాదు. రాజ్యాంగ సంస్థలను మేం సవాల్‌ చేయడం లేదు. అవి వ్యవహరిస్తున్న తీరుపైనే అభ్యంతరం చెబుతున్నాం’ అని వ్యాఖ్యానించారు.

Updated Date - Oct 20 , 2026 | 06:05 AM