Share News

ఖర్గే, రాహుల్‌లతో థరూర్‌ భేటీ

ABN , Publish Date - Jan 30 , 2026 | 03:35 AM

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ గురువారం ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్‌ గాంధీలను కలిశారు. పార్లమెంటు భవనంలోని ఖర్గే చాంబర్‌లో ఒక గంటా 45 నిమిషాలకుపైగా ఈ సమావేశం కొనసాగింది.

ఖర్గే, రాహుల్‌లతో థరూర్‌ భేటీ

న్యూఢిల్లీ, జనవరి 29: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ గురువారం ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్‌ గాంధీలను కలిశారు. పార్లమెంటు భవనంలోని ఖర్గే చాంబర్‌లో ఒక గంటా 45 నిమిషాలకుపైగా ఈ సమావేశం కొనసాగింది. అనంతరం బయటికి వచ్చిన శశిథరూర్‌ను సమావేశం ఎలా జరిగిందని విలేకరులు ప్రశ్నించగా.. ‘అంతా బాగుంది. అందరం ఒకే అభిప్రాయంతో ముందుకు సాగుతున్నాం’ అని జవాబిచ్చారు. త్వరలో జరుగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సీఎం అభ్యర్థి గురించి చర్చించారా? అని ప్రశ్నించగా, ‘అది అసలు సమస్యే కాదు. ఏ పదవిపైనా నాకు ఆసక్తి లేదు’ అన్నారు. సమావేశంలో ముగ్గురూ చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను శశిథరూర్‌ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.

Updated Date - Jan 30 , 2026 | 03:35 AM