Share News

సునేత్ర ప్రమాణం గురించి నాకు తెలియదు

ABN , Publish Date - Feb 01 , 2026 | 04:20 AM

మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్ర ప్రమాణ స్వీకారం విషయం తనకు తెలియదని ఎన్సీపీ(ఎప్పీ) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ అన్నారు.

సునేత్ర ప్రమాణం గురించి నాకు తెలియదు

  • ఎన్సీపీలోని రెండు వర్గాలు మళ్లీ ఏకం కావాలని అజిత్‌ కోరుకున్నారు

  • ఆ కోరికను నెరవేర్చాల్సి ఉంది: శరద్‌

ముంబై, జనవరి 31: మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్ర ప్రమాణ స్వీకారం విషయం తనకు తెలియదని ఎన్సీపీ(ఎప్పీ) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ అన్నారు. సునేత్ర ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ అంశానికి సంబంధించి పవార్‌ కుటుంబాన్ని ఎవరూ సంప్రదించలేదని, వార్తల ద్వారానే తెలిసిందని చెప్పారు. ఎన్సీపీలోని రెండు చీలిక వర్గాలు మళ్లీ ఏకమవుతాయంటూ వార్తలు వస్తున్న వేళ శరద్‌ పవార్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, ఎన్సీపీలోని రెండు వర్గాలు మళ్లీ కలవాలని అజిత్‌ పవార్‌ కోరుకున్నట్లు శరద్‌ పవార్‌ శనివారం విలేకరులతో అన్నారు. ‘‘విలీనం గురించి ఫిబ్రవరి 12న ప్రకటించాల్సి ఉంది. అజిత్‌ పవారే ఆ తేదీన విలీన ప్రకటన చేద్దాం అన్నారు. కానీ, దురదృష్టవశాత్తూ విమాన ప్రమాదం జరిగింది. ఆయన కోరికను నెరవేర్చాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు. అయితే, అజిత్‌ మరణం ఈ విలీన ప్రక్రియకు ఆటంకం కలిగించవచ్చని శరద్‌ పవార్‌ అభిప్రాయపడ్డారు.

Updated Date - Feb 01 , 2026 | 04:21 AM