Share News

‘శబరిమల నెయ్యి’ మింగింది సిబ్బందే

ABN , Publish Date - Feb 20 , 2026 | 02:44 AM

శబరిమల ఆలయంలో నెయ్యి కుంభకోణంపై 45 రోజుల్లోగా విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాల్సిందిగా విజిలెన్స్‌ అధికారులను కేరళ హైకోర్టు ఆదేశించింది.

‘శబరిమల నెయ్యి’ మింగింది సిబ్బందే

  • 33 మంది నిందితులు

  • కేరళ హైకోర్టుకు విజిలెన్స్‌ నివేదిక

కొచ్చి, ఫిబ్రవరి 19: శబరిమల ఆలయంలో నెయ్యి కుంభకోణంపై 45 రోజుల్లోగా విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాల్సిందిగా విజిలెన్స్‌ అధికారులను కేరళ హైకోర్టు ఆదేశించింది. స్వామివారి నెయ్యి అమ్మకాల రికార్డులు అస్తవ్యస్తంగా ఉండటంపై తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. శబరిమల లో అయ్యప్పను స్వాములు నెయ్యితో అభిషేకి స్తారు. అభిషేకానంతరం ఆ నెయ్యిని దేవస్థానం సేకరించి ప్యాకెట్లుగా చేసి.. ‘ఆదియ శిష్ఠం నెయ్యి’ పేరిట విక్రయిస్తుంది. ఈ నెయ్యి ప్యాకెట్ల అమ్మకాల్లో సుమారు రూ.21.39లక్షల స్కామ్‌ జరిగినట్టు విజిలెన్స్‌ గుర్తించింది. ఈ వ్యవహారంలో నిందితులంతా ఆలయ సిబ్బందేనని తేల్చింది. ముగ్గురు ఆలయ ప్రత్యేకాధికారులు, 30మంది కౌంటరు సిబ్బందిపై కేసు నమోదు చేసింది. గురువారం ఈమేరకు హైకోర్టుకు నివేదించింది.

Updated Date - Feb 20 , 2026 | 02:44 AM