Share News

‘సెంగోల్‌’ రూపకర్త ఉమ్మిడి ఎతిరాజ్‌ కన్నుమూత

ABN , Publish Date - Oct 22 , 2026 | 04:37 AM

చారిత్రక సెంగోల్‌ (రాజదండం) రూపకర్త తిరు ఉమ్మిడి ఎతిరాజ్‌(99) చెన్నైలో కన్నుమూశారు. 125ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఉమ్మిడి బంగారు జ్యువెలర్స్‌(వీబీజే) అధినేత అయిన ఎతిరాజ్‌..

‘సెంగోల్‌’ రూపకర్త ఉమ్మిడి ఎతిరాజ్‌ కన్నుమూత

న్యూఢిల్లీ, అక్టోబరు 21: చారిత్రక సెంగోల్‌ (రాజదండం) రూపకర్త తిరు ఉమ్మిడి ఎతిరాజ్‌(99) చెన్నైలో కన్నుమూశారు. 125ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఉమ్మిడి బంగారు జ్యువెలర్స్‌(వీబీజే) అధినేత అయిన ఎతిరాజ్‌ వృద్ధాప్య సమస్యలతో బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో తొలి ప్రధాని నెహ్రూకు అందించిన పవిత్రమైన సెంగోల్‌ను రూపొందించిన కుటుంబానికి చెందిన వ్యక్తిగా దేశ చరిత్రలో ఎతిరాజ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. దశాబ్దాల తర్వాత ఈ రాజదండానికి 2023లో కేంద్రం నూతన పార్లమెంట్‌ భవనంలో సముచిత స్థానం కల్పించింది. ఆ సందర్భంగా ఎతిరాజ్‌ను మోదీ స్వయంగా సత్కరించారు.

Updated Date - Oct 22 , 2026 | 04:39 AM