టీఎంసీ ఎమ్మెల్యేల అనర్హతపై అక్టోబరు 8నాటికి తేల్చండి
ABN , Publish Date - Sep 29 , 2026 | 05:09 AM
తృణమూల్ కాంగ్రెస్ తిరుగుబాటు వర్గానికి(రితబ్రత బెనర్జీ వర్గం) చెందిన 10మంది ఎమ్మెల్యేల అనర్హతపై అక్టోబరు 8నాటికి తేల్చాలని పశ్చిమబెంగాల్ అసెంబ్లీ స్పీకర్ రతీంద్ర బోస్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.
బెంగాల్ స్పీకర్‌కు స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
కోల్‌కతా, సెప్టెంబరు 28: తృణమూల్ కాంగ్రెస్ తిరుగుబాటు వర్గానికి(రితబ్రత బెనర్జీ వర్గం) చెందిన 10మంది ఎమ్మెల్యేల అనర్హతపై అక్టోబరు 8నాటికి తేల్చాలని పశ్చిమబెంగాల్ అసెంబ్లీ స్పీకర్ రతీంద్ర బోస్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. మమతాబెనర్జీ వర్గం ఎమ్మెల్యే సోవన్‌దేబ్ చటోపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. జులై 8న ఈ పిటిషన్ దాఖలైందని చెబుతూ మూడు నెలల్లోగా అంటే అక్టోబరు 8నాటికి దీనిపై నిర్ణయం తీసుకోవాలనే విషయం స్పీకర్ గుర్తెరిగి ఉంటారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2020 నాటి కీషమ్ మేఘచంద్ర సింగ్ వర్సెస్ మణిపూర్ అసెంబ్లీ స్పీకర్ కేసులో తామిచ్చిన తీర్పును ఉటంకించింది. తృణమూల్ కాంగ్రెస్ పేరు, పార్టీ గుర్తును రెండు వర్గాల్లో ఎవరికి కేటాయించాలనే విషయంపై త్వరగా తేల్చాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి రెండు వర్గాలు 4వారాల్లోగా తమ వాదనలను ఈసీ ముందుంచాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత మూడు నెలల్లోగా పార్టీ పేరు, గుర్తు కేటాయించేందుకు ఎవరికి అర్హత ఉందో తేల్చాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం ఈసీకి సూచించింది. పార్టీ పేరు, గుర్తు స్తంభింపచేయడంపై మమతాబెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
రోడ్డు తనిఖీలో చెంపదెబ్బ వివాదం! ఢిల్లీ మంత్రి పర్వేష్ వర్మపై కేసు నమోదు
ఎల్‌పీయూలో భయానక రాత్రి.. ఆ రోజు ఏం జరిగింది.