అజిత్ పవార్ మృతిపై అనుమానాలు
ABN , Publish Date - Feb 03 , 2026 | 02:28 AM
అవిభక్త శివసేనతో కలిసి 1995-99 మధ్య అధికారాన్ని పంచుకున్న బీజేపీ కుంభకోణాల చిట్టా తన వద్ద ఉందని ప్రకటించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిపై శివసేన...
శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్
ముంబై, ఫిబ్రవరి 2: అవిభక్త శివసేనతో కలిసి 1995-99 మధ్య అధికారాన్ని పంచుకున్న బీజేపీ కుంభకోణాల చిట్టా తన వద్ద ఉందని ప్రకటించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన మృతి తర్వాత జరిగిన ఘటనల్లో ఏదో రహస్యం దాగి ఉందని ముంబైలో మీడియాకు చెప్పారు. గత నెల 15న జరిగిన రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార సభలో 1995-99 మధ్య బీజేపీ అవినీతిపై తన వద్ద చిట్టా ఉందని అజిత్ పవార్ చెప్పిన కొద్ది రోజులకే విమాన ప్రమాదంలో మరణించారని సంజయ్ రౌత్ గుర్తు చేశారు. అజిత్‌ది ప్రమాదమేనని, రాజకీయాల్లేవని ఎన్సీపీ-ఎస్పీ అధినేత శరద్ పవార్ చెప్పినా.. ఈ ఘటనను కొట్టి పారేయలేమన్నారు. జనవరి 28న ఎన్నికల ప్రచారం కోసం ముంబై నుంచి బారామతికి బయలు దేరిన అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.