సాహిల్ తల్లిదండ్రుల నిరవధిక నిరాహార దీక్ష
ABN , Publish Date - Sep 25 , 2026 | 06:03 AM
ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్య ఘటనలో న్యాయం చేయాలని కోరుతూ అతని తల్లిదండ్రులు.. రవీంద్ర, సోనాలి గురువారం ముంబైలోని..
ఐఐటీ బాంబే క్యాంపస్ ముందు కాంగ్రెస్ నేతల నిరసన
ముంబై, సెప్టెంబర్ 24: ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్య ఘటనలో న్యాయం చేయాలని కోరుతూ అతని తల్లిదండ్రులు.. రవీంద్ర, సోనాలి గురువారం ముంబైలోని ఆజాద్ మైదానంలో నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. తమ కుమారుడిని వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యాసంస్థలో తరచూ కుల వేధింపులను ఎదుర్కొన్నట్టు తమ కుమారుడు తమతో చెప్పినట్లు రవీంద్ర వెల్లడించారు. అంతకుముందు వారు షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ చైర్మన్‌ను కలిసి.. తమ కుమారుడి మృతి కేసులో దర్యాప్తు వేగంగా జరిగేలా చూడాలని కోరారు. మరోవైపు సాహిల్ కుటుంబానికి సంఘీభావంగా కాంగ్రెస్ ఎంపీ వర్ష గైక్వాడ్, ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు ఐఐటీ బాంబే పోవై క్యాంపస్ ముందు నిరసనకు దిగగా.. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు సాహిల్ తల్లిదండ్రులను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్‌లో పరామర్శించారు. వారు చేస్తున్న పోరాటానికి అన్ని రకాల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.