Share News

పోస్ట్‌ ద్వారా అయ్యప్ప ప్రసాదం

ABN , Publish Date - Nov 15 , 2026 | 02:35 AM

శబరిమలలో అయ్యప్పను దర్శించుకొనే భక్తులు ఇకపై అరవణ పాయసం, ఇతర ప్రసాదాలను పోస్టు ద్వారా తమ ఇళ్లకు పంపించుకోవచ్చు.

పోస్ట్‌ ద్వారా అయ్యప్ప ప్రసాదం

  • శబరిమలలో భక్తుల కోసం తపాలా శాఖ ప్రత్యేక కౌంటర్‌

తిరువనంతపురం, నవంబరు 14: శబరిమలలో అయ్యప్పను దర్శించుకొనే భక్తులు ఇకపై అరవణ పాయసం, ఇతర ప్రసాదాలను పోస్టు ద్వారా తమ ఇళ్లకు పంపించుకోవచ్చు. రాబోయే మండల మకరవిళక్కు యాత్ర సమయానికి ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఇందుకోసం తపాలా శాఖ అయ్యప్ప సన్నిధానంలో 24 గంటలు పనిచేసే ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేయనుంది. శబరిమల ఆలయ కాంప్లెక్స్‌లో దేవస్థానం అరవణ, అప్పమ్‌ కౌంటర్ల పక్కనే ఈ ప్రత్యేక కౌంటర్‌ని ఏర్పాటు చేయనున్నారు. అయ్యప్ప దర్శనం అనంతరం భక్తులు తమ ఇళ్లకు చేరే సమయానికి ప్రసాదాలు వారి ఇళ్లకు చేరేలా ఈ ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు స్పీడ్‌ పోస్ట్‌ పార్సిల్‌ ద్వారా దేశ వ్యాప్తంగా ఎన్ని ప్రసాదం ప్యాకెట్లను అయినా పంపించుకోవచ్చు. కాగా 41 రోజుల అయ్యప్ప మండల పూజలు ఈ నెల 17న ప్రారంభమవుతాయి.

Updated Date - Nov 15 , 2026 | 02:37 AM