Share News

పంబ నదిలో చెత్త, వస్త్రాలు వేస్తే రూ.5000 జరిమానా

ABN , Publish Date - Nov 23 , 2026 | 04:00 AM

శబరిమల వెళ్లిన భక్తులు అక్కడ పంబ నదిలో చెత్త, వస్త్రాలు వేయకుండా నిషేధం విధించారు. ఈమేరకు శబరిమల అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ ఆదివారం ఆదేశాలు..

పంబ నదిలో చెత్త, వస్త్రాలు వేస్తే రూ.5000 జరిమానా

పత్తనంతిట్ట(కేరళం), నవంబరు 22: శబరిమల వెళ్లిన భక్తులు అక్కడ పంబ నదిలో చెత్త, వస్త్రాలు వేయకుండా నిషేధం విధించారు. ఈమేరకు శబరిమల అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. మండల పూజ యాత్రలో భక్తులు ఈ నిబంధనను తప్పనిసరిగా పాటించాలని, లేదంటే రూ.5000 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని స్థానిక అధికారులు తెలిపారు. నది నీటి కాలుష్యంతో పాటు ప్రజారోగ్యానికి వాటిల్లే ముప్పును దృష్టిలో పెట్టుకుని ఈ నిషేధాన్ని విధించినట్లు పేర్కొన్నారు. పంబ, దాని ఉపనదుల్లోని స్నాన ఘాట్‌లు, ఒడ్డున, పరిసర ప్రాంతాల్లో భక్తులు తమ వస్త్రాలు జార విడవడం, ఘన, ప్లాస్టిక్‌ తదితర వ్యర్థాలను వేయడాన్ని నిషేధించారు.

Updated Date - Nov 23 , 2026 | 04:01 AM