Share News

నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడు!

ABN , Publish Date - May 05 , 2026 | 05:46 AM

విజయ్‌కు మొదటి నుంచీ ఆత్మస్థైర్యం ఎక్కువని, ప్రజలు అతనిపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయరని ఆయన తండ్రి, సీనియర్‌ సినీ దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్‌ వ్యాఖ్యానించారు.

నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడు!

  • తండ్రిగా ఎంతో గర్విస్తున్నా: ఎస్‌ఏ చంద్రశేఖర్‌

చెన్నై, మే 4 (ఆంధ్రజ్యోతి): విజయ్‌కు మొదటి నుంచీ ఆత్మస్థైర్యం ఎక్కువని, ప్రజలు అతనిపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయరని ఆయన తండ్రి, సీనియర్‌ సినీ దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్‌ వ్యాఖ్యానించారు. ప్రజలు తన కుమారుడి నుంచి చాలా ఆశిస్తున్నారని, ఎంతో నమ్మకం పెట్టుకున్నారని పేర్కొన్నారు. వాటిని విజయ్‌ కచ్చితంగా నెరవేరుస్తారని తెలిపారు. విజయ్‌ ప్రజా జీవితంలోకి రావడం ఆకస్మిక నిర్ణయం కాదని, 20 ఏళ్లకుగా చేసిన ప్రణాళికల ఫలితమేనని పేర్కొన్నారు. ‘విజయ్‌ విజయం పట్ల ఒక తండ్రిగా ఎంతో గర్వపడుతున్నాను. సంతోషంగా ఉన్నాను. నా బిడ్డకు హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ తన ఆనందాన్ని, ఉద్వేగాన్ని వ్యక్తం చేశారు. ‘రెండేళ్లుగా అతనిలో తమిళనాడు ముఖ్యమంత్రి అవుతానన్న నమ్మకం చూశాను. ఇది చారిత్రక విజయం. రాష్ట్ర ప్రజల కోసం విజయ్‌ సుపరిపాలన అందిస్తారు’ అని వ్యాఖ్యానించారు.

Updated Date - May 05 , 2026 | 05:49 AM