Share News

చైనాకు వెళ్లాల్సిన రష్యా చమురు భారత్‌కు!

ABN , Publish Date - Mar 19 , 2026 | 06:35 AM

ష్యా నుంచి ముడి చమురుతో గత జనవరిలోనే బయలుదేరిన ‘ఆక్వా టైటాన్‌’ నౌక చైనాకు చేరాల్సి ఉంది. అయితే.. మార్గమధ్యంలో అది దిశ మార్చుకుని...

 చైనాకు వెళ్లాల్సిన రష్యా చమురు భారత్‌కు!

న్యూఢిల్లీ, మార్చి 18: రష్యా నుంచి ముడి చమురుతో గత జనవరిలోనే బయలుదేరిన ‘ఆక్వా టైటాన్‌’ నౌక చైనాకు చేరాల్సి ఉంది. అయితే.. మార్గమధ్యంలో అది దిశ మార్చుకుని భారత్‌ దిశగా పయనిస్తోందని బ్లూమ్‌బెర్గ్‌ సంస్థ వెల్లడించింది. చైనా వెళ్లాల్సిన మరో 6చమురు ట్యాంకర్లు సైతం భారత్‌ వైపు వస్తున్నాయని తెలిపింది. షిప్‌ ట్రాకింగ్‌ డేటా ఆధారంగా ఈ వివరాలు తెలిశాయని పేర్కొంది. అక్వాటైటాన్‌ నౌక ఈ నెల 21 నాటికి కర్ణాటకలోని కొత్త మంగళూరుకు చేరుతుందని తెలిపింది. చమురు లోడ్‌తో బాల్టిక్‌ సముద్రం నుంచి జనవరిలో ఈ నౌక బయలు దేరిందని.. కానీ, దక్షిణ చైనా సముద్రంలో ఇది యూ-టర్న్‌ తీసుకున్నట్టు పేర్కొంది. వాస్తవానికి ఈ నౌక చైనాలోని రిజావో పోర్టుకు చేరాల్సి ఉందని, అయితే, రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేసేందుకు అమెరికా తాత్కాలిక అనుమతులు ఇవ్వడంతో ఈ నౌక దిశ మార్చుకుందని బ్లూమ్‌బెర్గ్‌ తెలిపింది. అయితే, చైనాకు వెళ్లాల్సిన చమురు నౌక భారత్‌కు వస్తోందన్న సమాచారం తమకు తెలియదని కేంద్ర పోర్టులు, షిప్పింగ్‌ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్‌ సిన్హా బుధవారం తెలిపారు.

ఇవి కూడా చదవండి..

అక్రమవలసదారులకు అమెరికా ఆఫర్.. దేశం నుంచి వెళ్లిపోతే రూ.2.4 లక్షలు..

మీది డేగ చూపు అయితే.. ఈ అడవిలో చిరుతను 5 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Mar 19 , 2026 | 06:35 AM