రష్యాకు రోజుకు 1385 కోట్ల అదనపు రాబడి!
ABN , Publish Date - Mar 14 , 2026 | 04:18 AM
పశ్చిమాసియాలో యుద్ధం రష్యాకు కాసులు కురిపిస్తోంది. యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం కూడా కనిపించకపోవడం..
న్యూఢిల్లీ, మార్చి 13: పశ్చిమాసియాలో యుద్ధం రష్యాకు కాసులు కురిపిస్తోంది. యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం కూడా కనిపించకపోవడం.. ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేయడం రష్యాకు కలిసొచ్చింది. ఆ దేశ ముడి చమురుకు భారీగా డిమాండ్ పెరిగింది. అదేసమయంలో ధరలు కూడా పెరగడంతో రష్యా ఖజానాకు రాబడి పెరిగింది. చమురు అమ్మకాల ద్వారా రోజుకు దాదాపు రూ.1385 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతోంది. యుద్ధం మొదలైన తర్వాత 12 రోజుల్లో ఆ దేశానికి చమురు ఎగుమతుల ద్వారా రూ.11,960-17,480 కోట్ల మేర పన్ను ఆదాయం సమకూరింది. ముడి చమురు ధరలు ఇలాగే కొనసాగితే ఈ నెలాఖరు కల్లా రష్యాకు దాదాపు రూ.46 వేల కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా.