తుపాకులు అమర్చిన రోబో డాగ్స్!
ABN , Publish Date - Jan 22 , 2026 | 03:22 AM
భారత సైన్యం సరికొత్త రోబోటిక్ ఆయుధాలను సమకూర్చుకుంది. ఇటీవల ఆర్మీ తన ఆయుధ సంపత్తిలోకి 100 రోబోటిక్ మ్యూల్స్ (మల్టీ యుటిలిటీ లెగ్డ్ ఎక్వి్‌పమెంట్)ను ప్రవేశపెట్టింది.
గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించనున్న సైన్యం
న్యూఢిల్లీ, జనవరి 21: భారత సైన్యం సరికొత్త రోబోటిక్ ఆయుధాలను సమకూర్చుకుంది. ఇటీవల ఆర్మీ తన ఆయుధ సంపత్తిలోకి 100 రోబోటిక్ మ్యూల్స్ (మల్టీ యుటిలిటీ లెగ్డ్ ఎక్వి్‌పమెంట్)ను ప్రవేశపెట్టింది. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరగనున్న గణతంత్ర దినోత్సవ పరేడ్ రిహార్సల్స్‌లో భాగంగా తుపాకులు అమర్చిన రోబోటిక్ డాగ్‌లను ఆర్మీ ప్రదర్శించింది. నాలుగు కాళ్లు కలిగి ఉండే ఈ రోబోలను తొలుత ఐపీఎల్‌లో వినియోగించగా.. అందరి దృష్టినీ ఆకర్షించాయి. వాటికి కెమెరాలను అమర్చి క్రికెట్ మ్యాచ్‌ల చిత్రీకరణకు వాడారు. తాజాగా ఆ రోబోటిక్ డాగ్‌లకు రైఫిళ్లు అమర్చి, సైన్యం రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రదర్శించనుంది. ఇక రిపబ్లిక్ డే పరేడ్‌లో డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన దీర్ఘ శ్రేణి ‘యాంటీ షిప్ హైపర్‌సోనిక్ గ్లైడ్ క్షిపణి’ని కూడా 77వ గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించనున్నారు. 1500 కి.మీ. రేంజ్ కలిగిన ఈ క్షిపణితో హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత రక్షణ సామర్థ్యాలకు మరింత ఊతమిచ్చినట్లవుతుంది.