Share News

పెరిగిన వంట నూనెల ధరలు!

ABN , Publish Date - Mar 13 , 2026 | 04:02 AM

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ రిటైల్‌ మార్కెట్లలో వంట నూనెల ధరలు కాస్త పెరిగాయి. గతం వారం రోజులతో పోలిస్తే వివిధ రకాల వంట.....

పెరిగిన వంట నూనెల ధరలు!

న్యూఢిల్లీ, మార్చి 12: పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ రిటైల్‌ మార్కెట్లలో వంట నూనెల ధరలు కాస్త పెరిగాయి. గతం వారం రోజులతో పోలిస్తే వివిధ రకాల వంట నూనెల ధరలు కిలోకు రూ.1-4 మేర పెరిగాయి. ప్రపంచ మార్కెట్‌లో ముడి పామాయిల్‌, ముడి సోయాబీన్‌, ముడిచమురు ధరల పెరుగుదలతో పాటు సరఫరాలో అంతరాయం కారణంగానే ధరలు పెరిగినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఆవనూనె కిలో ప్యాకెట్‌పై కనిష్ఠంగా 50 పైసలు పెరగ్గా.. సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌పై గరిష్ఠంగా రూ.4 పెరిగింది.

Updated Date - Mar 13 , 2026 | 04:02 AM