బియ్యం నిల్వల వెల్లడికి పోర్టల్ ప్రారంభం
ABN , Publish Date - Nov 15 , 2026 | 02:33 AM
దేశవ్యాప్తంగా ఉన్న మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారులు, రిటైలర్ల దగ్గర ఉన్న బియ్యం నిల్వలను, గోదాముల్లో ఉన్న వరిధాన్యం నిల్వలను వెల్లడించడానికి ఉద్దేశించిన ఆన్‌లైన్ పోర్టల్..
ప్రతి శుక్రవారం మిల్లర్లు, వ్యాపారులు నిల్వలను
అప్‌డేట్ చేయాల్సిందే: కేంద్రం
న్యూఢిల్లీ, నవంబరు 14: దేశవ్యాప్తంగా ఉన్న మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారులు, రిటైలర్ల దగ్గర ఉన్న బియ్యం నిల్వలను, గోదాముల్లో ఉన్న వరిధాన్యం నిల్వలను వెల్లడించడానికి ఉద్దేశించిన ఆన్‌లైన్ పోర్టల్ foodstock.dfpd.gov.in ను కేంద్రప్రభుత్వం ప్రారంభించి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎల్‌నినో నేపథ్యంలో మిల్లర్లు, వ్యాపారులు పరిమితికి మించి బియ్యాన్ని నిల్వ చేసి మార్కెట్‌లో కొరత సృష్టించకుండా కేంద్రప్రభుత్వం ఈ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎవరి దగ్గర ఎన్నెన్ని బియ్యం, వరిధాన్యం నిల్వలు ఉన్నాయో ప్రతి శుక్రవారం ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌డేట్ చేయాలని ఆదేశించింది. పోర్టల్‌లో రిజిస్టర్ కాని వ్యాపారులపైన, పరిమితికి మించి బియ్యాన్ని నిల్వ చేసినా నిత్యావసరాల చట్టం-1955చట్టం కింద చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా బియ్యం ధరలు పెరగకుండా, ఒకే రీతిన ఉండేలా కేంద్ర ప్రభుత్వం అవసరమైన రాష్ట్రాల్లో నాఫెడ్, ఎన్‌సీసీఎ్‌ఫ, కేంద్రియ భండార్‌లకు అదనపు బియ్యాన్ని కేటాయిస్తోంది.