రాహుల్ చెప్పేదాకా ఢిల్లీ నుంచి కదలొద్దు
ABN , Publish Date - Oct 13 , 2026 | 06:14 AM
ఢిల్లీకి వచ్చిన కాంగ్రెస్ నేతలెవరూ తాము చెప్పేదాకా దేశ రాజధానిని వీడి వెళ్లవద్దని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
తెలంగాణ నేతలకు రేవంత్ ఆదేశం
అరెస్టు చేసే అవకాశముందని వెల్లడి
రాహుల్ చెప్పేదాకా ఢిల్లీ నుంచి కదలొద్దు
కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ ఆదేశం
న్యూఢిల్లీ, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీకి వచ్చిన కాంగ్రెస్ నేతలెవరూ తాము చెప్పేదాకా దేశ రాజధానిని వీడి వెళ్లవద్దని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ ఉద్యమం ఒక్కరోజుతో ముగిసేది కాదన్నారు. తమ నేత రాహుల్‌గాంధీ ఎన్ని రోజులని చెబుతారో ఇంకా తెలియదని, అందుకే ఎవరూ తిరుగు ప్రయాణానికి ఇప్పుడే టికెట్లు బుక్ చేసుకోవద్దని అన్నారు. ఢిల్లీకి వచ్చిన నేతలను అరెస్టు చేసే అవకాశాలున్నాయని తెలిపారు. అందరినీ అరెస్టు చేసి ఢిల్లీతోపాటు ఇతర రాష్ట్రాలకు తరలించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. వారికి ధైర్యం కల్పించేందుకు, సాయం చేసేందుకు హెల్ప్ డెస్క్ అవసరమన్నారు. వారందరినీ విడిపించేందుకు ఎవరి స్థాయిలో వారు పని చేయాలని సూచించారు. హెల్ప్ డెస్క్ 24 గంటలూ పనిచేసేలా అందుబాటులో ఉండాలని, ఆ బాధ్యతల్ని ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యవేక్షించాలని ఆదేశించారు.