పాత ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి
ABN , Publish Date - Jan 25 , 2026 | 05:38 AM
పాత ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం(ఏఐఏడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ, జనవరి 24(ఆంధ్రజ్యోతి): పాత ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం(ఏఐఏడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ డిమాండ్ చేశారు. ఇక్కడ జరుగుతున్న ఏఐఏడబ్ల్యూయూ జాతీయ సమావేశాల్లో శనివారం ఆయన మాట్లాడుతూ.. గతేడాది తెచ్చిన కొత్త ఉపాధి చట్టం పేదలపై ప్రాణాంతక దాడిగా అభివర్ణించారు. కొత్త చట్టంలో హక్కులు, భద్రత లేదని, గ్రామీణ పేదలకు ఈ చట్టంతో తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. పాత ఉపాధి హామీ చట్టం ద్వారా గత 15 ఏళ్లలో రూ.9.98 లక్షల కోట్లు ఖర్చు పెట్టారని, 4700 కోట్ల పనిదినాలు కల్పించారని తెలిపారు. కొత్త చట్టాన్ని వెనక్కి తీసుకునేందుకు రాబోయే నాలుగు నెలలు దేశవ్యాప్త పోరాటాలకు సిద్ధమవుతున్నామని, ఇందులోభాగంగా వచ్చే నెల 12న దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టనున్నట్లు తెలిపారు.