Republic Day 2026: వందేమాతరం ఇతివృత్తంగా గణతంత్ర వేడుకలు
ABN , Publish Date - Jan 18 , 2026 | 03:28 AM
ఒకటిన్నర శతాబ్దాలు పూర్తిచేసుకున్న జాతీయ గేయం ‘వందేమాతరం’ ఇతివృత్తంగా దేశ రాజధానిలో ఈసారి గణతంత్ర వేడుకలు జరగనున్నాయి..
న్యూఢిల్లీ, జనవరి 17: ఒకటిన్నర శతాబ్దాలు పూర్తిచేసుకున్న జాతీయ గేయం ‘వందేమాతరం’ ఇతివృత్తంగా దేశ రాజధానిలో ఈసారి గణతంత్ర వేడుకలు జరగనున్నాయి. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో నిర్వహించే రిపబ్లిక్ డే పరేడ్‌లో 30 శకటాలు సందడి చేయనున్నాయి. వాటిలో 17 శకటాలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలవి కాగా, 13 శకటాలు కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందినవి ఉంటాయి. అశిరాకండి హస్తకళపై అస్సాం, వందేమాతరం ఇతివృత్తంగా గుజరాత్, ఛత్తీ్‌సగఢ్, గణేశ్ ఉత్సవాలపై మహారాష్ట్ర, స్వాతంత్ర్యోద్యమంలో బెంగాల్ పాత్రపై పశ్చిమ బెంగాల్ తమ శకటాలను ప్రదర్శిస్తాయి. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఎదుగుదలపై తమిళనాడు, వాటర్ మెట్రో, 100 శాతం డిజిటల్ పాలనపై కేరళ, హార్న్‌బిల్ ఫెస్టివల్‌పై నాగాలాండ్ శకటాల ప్రదర్శన ఉంటుంది. ఆపరేషన్ సిందూర్‌పై త్రివిధ దళాలు సంయుక్తంగా శకటాన్ని ప్రదర్శించనున్నాయి.