ప్రముఖ రచయిత వీవీబీ మృతి
ABN , Publish Date - Feb 03 , 2026 | 03:04 AM
ప్రముఖ రచయిత, కవి, అనువాదకుడు వీవీబీ రామారావు మరణించారు. విజయనగరానికి చెందిన వీవీబీ రామారావు మహారాజా కాలేజీలో మూడు దశాబ్దాలకు పైగా ఆంగ్ల విభాగానికి అధిపతిగా ఉన్నారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): ప్రముఖ రచయిత, కవి, అనువాదకుడు వీవీబీ రామారావు మరణించారు. విజయనగరానికి చెందిన వీవీబీ రామారావు మహారాజా కాలేజీలో మూడు దశాబ్దాలకు పైగా ఆంగ్ల విభాగానికి అధిపతిగా ఉన్నారు. కొడవటిగంటి కుటుంబరావు చదువు, ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లి, విశ్వనాథ రామాయణ కల్పవృక్షంలోని సుందరాకాండ తదితర గ్రంథాలను ఇంగ్లీషులోకి అనువదించారు. వీవీబీ దాదాపు 200 మంది ఆధునిక కవుల కవితలను ఇంగ్లీషులోకి అనువదించి రెండు సంపుటాలుగా వెలువరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ కోసం ఉన్నవ మోనోగ్రా్‌ఫతోపాటు పలు రచనలు చేసిన వీవీబీ ఆనంద గజపతి రాజు ఆత్మకథను కూడా రచించారు. స్వయంగా పలు నవలలు, కథలు, కవితలు రాశారు. ఆయన భౌతిక కాయానికి సోమవారం ఢిల్లీలో అంత్యక్రియలు జరిగాయి.