Madhav Gadgil Passes Away: ప్రముఖ పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ కన్నుమూత
ABN , Publish Date - Jan 09 , 2026 | 04:18 AM
ప్రముఖ పర్యావరణవేత్త, పశ్చిమ కనుమల పరిరక్షణ యోధుడు మాధవ్ గాడ్గిల్ కన్నుమూశారు. 83ఏళ్ల వయసున్న ఆయన, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ బుధవారం పుణేలో తుదిశ్వాస విడిచారు....
పశ్చిమ కనుమల పరిరక్షణ కోసం పోరాటం
పుణే, జనవరి 8: ప్రముఖ పర్యావరణవేత్త, పశ్చిమ కనుమల పరిరక్షణ యోధుడు మాధవ్ గాడ్గిల్ కన్నుమూశారు. 83ఏళ్ల వయసున్న ఆయన, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ బుధవారం పుణేలో తుదిశ్వాస విడిచారు. పశ్చిమ కనుమల జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో ఆయన చేసిన కృషి ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. 1942లో పుణేలో జన్మించిన గాడ్గిల్, భారత పర్యావరణ విధానాలను రూపొందించడంలో కీలకపాత్ర పోషించారు. బెంగుళూరులోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎ్‌ససీ)లో ‘సెంటర్ ఫర్ ఎకోలాజికల్ సైన్సెస్’ వ్యవస్థాపకుడిగా సేవలందించారు. పశ్చిమ కనుమల పర్యావరణ వ్యవస్థను కాపాడ డానికి 2010లో కేంద్రం ఏర్పాటుచేసిన ‘గాడ్గిల్ కమిషన్’కు ఆయ న చైర్మన్‌గా వ్యవహరించి.. పలు సాహసోపేతమైన, శాస్త్రీయమైన సిఫారసులను చేశారు. పర్యావరణ రంగంలో ఆయన చేసిన కృషికిగాను ఐక్యరాజ్యసమితి 2024లో అత్యున్నత పర్యావరణ పురస్కా రం ‘చాంపియన్ ఆఫ్ ఎర్త్’తో గౌరవించింది. అలాగే, పద్మవిభూ టషణ్, పద్మశ్రీ, టైలర్ ప్రైజ్(పర్యావరణ రంగంలో నోబెల్ లాంటిది)వంటి అనేక పురస్కారాలు ఆయనను వరించాయి. మాధవ్ గాడ్గిల్ మృతిపట్ల కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకా గాంధీ, జైరాం రమేశ్ తదితరులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.